అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ‘‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసిన అమరజీవి. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలంటూ పోరాడిన అభ్యుదయవాది. సమస్యల పరిష్కారం కోసం గాంధీ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనించిన మహనీయులు పొట్టి శ్రీరాములు’’ అని లోకేష్ కొనియాడారు.
ఇవి కూడా చదవండి