సాధించావు సాధియా..శెహ‌భాష్‌: Lokesh

ABN , First Publish Date - 2021-12-27T14:38:18+05:30 IST

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వ‌ర్ణం సాధించిన బాలిక‌ను టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ అభినందించారు.

సాధించావు సాధియా..శెహ‌భాష్‌: Lokesh

అమరావతి:  టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వ‌ర్ణం సాధించిన బాలిక‌ను టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ అభినందించారు. ‘‘అంత‌ర్జాతీయ ప‌వ‌ర్‌లిఫ్టింగ్ పోటీల్లో స్వ‌ర్ణం సాధించావు సాధియా శెహ‌భాష్‌’’ అంటూ ప్రసంసించారు. ఈ మేర‌కు సోమ‌వారం ఆయ‌న ఓ ప్రకటనను విడుదల చేశారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో మంగ‌ళ‌గిరికి చెందిన సాధియా స్వర్ణ పతకాన్ని సాధించ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. 57 కేజీల విభాగంలో జరిగిన ఈ పోటీల్లో స్క్వాడ్- 167.5 కేజీలు, బెంచ్ ప్రెస్- 70 కేజీలు, డెడ్ లిఫ్ట్ 157.5 కేజీలు మొత్తంగా 395 కేజీలు బరువు ఎత్తి ఓవరాల్ బంగారు పతకాన్ని సాధించి మంగ‌ళ‌గిరి ఖ్యాతిని అంత‌ర్జాయ‌తీ స్థాయికి తీసుకెళ్లిన సాధియాని మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తున్నాన‌ని పేర్కొన్నారు. సాధియా ఈ ఘ‌న‌త సాధించ‌డంలో తండ్రి, కోచ్‌ షేక్  సంధాని పాత్ర ఎన‌లేనిద‌ని ప్ర‌శంసించారు. అంత‌ర్జాతీయ పోటీల్లో స‌త్తాచాటుతోన్న సాధియాకి త‌న‌కు చేత‌నైనంత స‌హ‌కారం అందిస్తాన‌ని లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2021-12-27T14:38:18+05:30 IST