అమరావతి: అల్లూరి(Alluri) 125వ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) చేతుల మీదుగా అల్లూరి విగ్రహావిష్కరణ జరగడం ఒక తెలుగువాడిగా సంతోషంగా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్(Lokesh) అన్నారు. అమాయక గిరిజనం నిరంకుశ పాలకుల చేతుల్లో నలిగిపోతుంటే...వారిలో అల్లూరి ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చారన్నారు. స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరిని ఆజాది కా అమృత మహోత్సవ్‌లో భాగంగా స్మరించుకోవడం మనకు గర్వకారణమని అన్నారు. అల్లూరి జయంతి సందర్భంగా ఆ విప్లవజ్యోతి సాహస చరిత్రను స్మరించుకుని స్ఫూర్తిని పొందుదామని లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి