జగన్‌ను నడిరోడ్డు మీద ఉరి తీయాలా?: Lokesh

ABN , First Publish Date - 2021-07-22T17:33:09+05:30 IST

విశాఖలో ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌పై టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.

జగన్‌ను నడిరోడ్డు మీద ఉరి తీయాలా?: Lokesh

అమరావతి: విశాఖలో ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌పై టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరో పంపిన మెసేజ్‌ని ఫార్వార్డ్ చేస్తేనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే...విద్యాబుద్ధులు నేర్పే గురువులకు త‌న చీప్ లిక్క‌ర్ అమ్మే మ‌ద్యం దుకాణాల ముందు డ్యూటీవేసిన జ‌గ‌న్‌ రెడ్డి గారిని ఏం చేయాలని ప్రశ్నించారు. నడిరోడ్డు మీద ఉరి తియ్యాలా అని అన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ విశాఖ జిల్లా నాతవరం మండలం ఉప్పరగూడెం ప్రాథమిక పాఠ‌శాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న ఎస్.నాయుడు‌ను సస్పెండ్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.  సర్వీస్ రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరిస్తూ వైసీపీ ప్రభుత్వం భావవ్యక్తీకరణ స్వేచ్చను హరిస్తోందని మండిపడ్డారు. మాస్టార్‌పై తక్షణమే సస్పెన్షన్ ఎత్తివెయ్యాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి పాలనలో టీచర్లను వేధించడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఉపాధ్యాయుల స‌మ‌స్యల పరిష్కారం కోసం చేసే ప్రతి పోరాటానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుందని లోకేష్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-07-22T17:33:09+05:30 IST