సజ్జలకు కూన రవి కౌంటర్

ABN , First Publish Date - 2021-10-06T01:52:21+05:30 IST

డ్రగ్స్ వ్యవహారం నుంచి ప్రభుత్వాన్ని, సీఎంను బయటపడేయాలన్న కంగారు, బెరుకు సజ్జల మాటల్లో కనిపించాయని ...

సజ్జలకు కూన రవి కౌంటర్

అమరావతి: డ్రగ్స్ వ్యవహారం నుంచి ప్రభుత్వాన్ని, సీఎంను బయటపడేయాలన్న కంగారు, బెరుకు సజ్జల మాటల్లో కనిపించాయని మాజీ విప్ కూన రవికుమార్ అన్నారు. జగన్‌రెడ్డికి లేని క్యారెక్టర్‌ను ఎవరు ఎలా నాశనం చేస్తారో సజ్జల చెప్పాలన్నారు. ప్రభుత్వ అవినీతి, దోపిడీ పారదర్శకంగానే జరుగుతోందని సజ్జల గుర్తించాలని సూచించారు. 28 టన్నుల హెరాయిన్ రాష్ట్రంలోకి దిగుమతి అయితే సీఎం జగన్‌రెడ్డి, డీజీపీ ఏం లేనట్లే మాట్లాడారని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో ప్రమేయమున్న అధికార పార్టీ పెద్దల పేర్లు బయటపెట్టాలని కోరారు. శవరాజకీయాలు చేయడంలో ఆరితేరిన పార్టీ వైసీపీ అని విమర్శించారు. తండ్రి చావుకు కారణమైన వారిపై జగన్ సీఎం అయ్యాక సీబీఐ విచారణ ఎందుకు కోరలేదన్నారు. బాబాయిని చంపిన వారెవరో జగన్‌రెడ్డి ఎందుకు కనిపెట్టలేకపోతున్నారని కూన రవికుమార్ ప్రశ్నించారు. 

Updated Date - 2021-10-06T01:52:21+05:30 IST