Abn logo
Sep 28 2021 @ 09:55AM

వైసీపీ పాలనలో బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం: TDP leader

కడప: వైసీపీ పాలనలో బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బ్రాహ్మణ ఫ్రెంట్ జాతీయ అధ్వక్షుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాధ్ శర్మ అన్నారు. బ్రాహ్మణులపై జగన్ ప్రభుత్వ  నిర్లక్ష వైఖరిని ఎండకట్టేందుకు బ్రాహ్మణులకు భరోసా కల్పించేందుకు టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భరోసా యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయిస్తామన్న సీఎం జగన్.. బ్రాహ్మణ అభివృద్ధినే నిర్వీర్వం చేశారని మండిపడ్డారు. దేవాదయశాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పోరేషన్‌ను బీసీ కార్పోరేషన్‌లోకి చేర్చడం దుర్మార్గమన్నారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణుల అభివృద్దికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని  సాయినాధ్ తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption