అమరావతి: రాష్ట్రంలో బ్యాక్ బోన్ కులాలైన బీసీలకు నేడు జగన్ పాలనలో రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు. టీడీపీ నేత చంద్రయ్యను పొట్టనబెట్టుకుని వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని ఆయన ఆరోపించారు. రాజకీయ నేరస్తులు అధికారం చేపడితే ఎంత ప్రమాదకరమో దానికి నేడు జగన్ ఉదాహరణ అని ఆయన అన్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేక హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి