స్థానిక ఎన్నికల్లో వైసీపీ కుట్రలు: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2021-11-14T03:04:45+05:30 IST

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీ రకరకాల

స్థానిక ఎన్నికల్లో వైసీపీ కుట్రలు: కళా వెంకట్రావు

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ రకరకాల కుట్రలు చేస్తోందని టీడీపీ నేత కళా వెంకట్రావు ఆరోపించారు. వైసీపీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ప్రజలు ఎదురు తిరుగుతున్నారన్నారు. తమ ప్రజా వ్యతిరేక విధానాలను మసిపూసి మారేడుకాయ చేసే విన్యాసాన్ని వైసీపీ చేస్తోందన్నారు. హవాలా మంత్రి ప్రకటన చూస్తే దొంగే దొంగ అని అరచినట్లుగా ఉందన్నారు. కుప్పంలో వైసీపీ నేతలు ఓటుకు రూ.10 వేలు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. తిరుపతిలో వైసీపీ చేసిన దుర్మార్గాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. 

Updated Date - 2021-11-14T03:04:45+05:30 IST