ఆ నేర్పరితనం ఒక్క Jaganకే ఉంది: Jawahar

ABN , First Publish Date - 2022-06-29T19:47:09+05:30 IST

సీఎం జగన్‌పై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఆ నేర్పరితనం ఒక్క Jaganకే ఉంది: Jawahar

అమరావతి (Amaravathi): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ (Jawahar) విమర్శలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక్క జీపీఎఫ్ ఫండ్ కాకుండా వివిధ పథకాలకు సంబంధించిన నిధులు కూడా డైవర్ట్ చేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిది ఏ ప్రభుత్వ అనేది అర్థం కావడం లేదన్నారు. వైసీపీ పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మిక సంఘాలను మోసం చేసే నేర్పరితనం ఒక్క జగన్‌కే ఉందన్నారు. సీఎస్‌గా పనిచేస్తున్న సమీర్ శర్మ ఒక  డూ..డూ.. బసవన్నలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. సీనియర్ ఐపీయస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు.. మరి శ్రీలక్ష్మిపై ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సమీర్ శర్మ.. సీఎం జగన్‌ను నమ్ముకుంటే ఖచ్చితంగా జైలుకు వెళ్తారని జవహర్ వ్యాఖ్యానించారు.


రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90వేల మంది ఉద్యోగులు... వారికి చెందిన రూ.800 కోట్ల జీపీఎఫ్‌ నిధులు మాయమైపోయాయి! ఉద్యోగులకు తెలియకుండా, వారి సమ్మతి లేకుండానే ప్రభుత్వం ఆ సొమ్మును లాగేసుకుంది. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం జీపీఎఫ్‌ నుంచి అడ్వాన్సు ఇప్పించాలని ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండగా.... ఇప్పుడు వారి ఖాతాలను ఖాళీ చేయడం కలకలం సృష్టిస్తోంది. అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం(ఏజీ) గత ఆర్థిక సంవత్సరం ఉద్యోగుల జీపీఎఫ్‌ వార్షిక స్టేట్‌మెంట్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఆ లావాదేవీలను చూసుకున్న ఉద్యోగులకు అసలు సంగతి తెలిసింది. తమ ఖాతాల నుంచి తమకు తెలియకుండానే సొమ్ము డెబిట్‌ అయినట్లు తేలింది. డీఏ బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో జూలై 2018,  జనవరి 2019 డీఏ బకాయిలను ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి వారికి తెలియకుండానే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంది. 

Updated Date - 2022-06-29T19:47:09+05:30 IST