తూర్పుగోదావరి: సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy), హోంమంత్రి అనాలోచితంగా మాట్లాడటం వల్లే కొవ్వూరులో చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని మాజీ మంత్రి జవహర్(Jawahar) వ్యాఖ్యానించారు. లైంగిక దాడికి గురైన చిన్నారిని శుక్రవారం జవహర్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వేళాకోళం, వెకిలి చేష్టలు, ప్రతీకారంతో పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. అత్యాచార ఘటనలు అడ్డుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండటం దురదృష్టకరమన్నారు. లైంగిక దాడి బాధితులకు ఫోక్సో చట్టం కింద ఇవ్వాల్సిన పరిహారం ఈ రోజుకి ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు మండలంలో అత్యాచార ఘటనలో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి దృష్టంతా గోంగూర గడ్డ ఇసుక ర్యాంప్ మీద ఉందని జవహర్ యెద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి