మద్యపాన నిషేధం హామీ ఏమైంది జగన్ రెడ్డి?: జవహర్

ABN , First Publish Date - 2021-09-03T19:00:23+05:30 IST

రాష్ట్రంలో మద్యపాన నిషేధిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది జగన్ రెడ్డి? అని మాజీ మంత్రి, టీడీపీ నేత కేఎస్ జవహర్ ప్రశ్నించారు.

మద్యపాన నిషేధం హామీ ఏమైంది జగన్ రెడ్డి?: జవహర్

అమరావతి: రాష్ట్రంలో మద్యపాన నిషేధిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది జగన్ రెడ్డి? అని మాజీ మంత్రి, టీడీపీ నేత కేఎస్ జవహర్ ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మనుషుల బలహీనతను ముఖ్యమంత్రి ఆదాయ వనరుగా మార్చుకోవడం దారుణమన్నారు. బ్రాండెడ్ కంపెనీలను మూసివేయించి సొంత బ్రాండ్లను అమ్ముతున్నారని ఆరోపించారు. దశలవారీ మద్యపాన నిషేధమన్న జగన్ మాట తప్పి మడమ తిప్పారని యెద్దేవా చేశారు. మహిళల మాంగళ్యాన్ని హరించేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. నాటుసారా తయారీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. మద్యం ఆదాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జవహర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-09-03T19:00:23+05:30 IST