Abn logo
Jun 17 2021 @ 13:00PM

లోకేష్‌పై పంతంతోనే పరీక్షల నిర్వహణ: జవహర్

అమరావతి:  సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థను జగన్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని మాజీ మంత్రి కే.ఎస్. జవహర్ మండిపడ్డారు. జాతీయ విద్యా విధానం పేరుతో విద్యార్థులను విద్యకు దూరం చేసే విధానాలను ప్రభుత్వం అమలు చేయబోతోందన్నారు. లోకేష్‌పై పంతంతో రద్దు చేయాల్సిన పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. ఆవుచేలో మేస్తే దూడగట్టున మేస్తుందా అన్నట్లు ఆదిమూలపు సురేశ్ వ్యవహరిస్తున్నారని అన్నారు. విద్యాశాఖ సంచాలకులు ఫ్యాప్టోకు నోటీసులివ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేసే క్రమంలోనే విద్యారంగపు మేథావులకు నోటీసులిచ్చారని మండిపడ్డారు. నాడు-నేడు పేరుతో ఇప్పటికే ఉపాధ్యాయులను బలితీసుకున్న ప్రభుత్వం, విద్యార్థులను బలిచేసే చర్యలను మానుకోవాలని జవహర్ హితవుపలికారు.