విజయవాడ: వైసీపీ నేతలనుద్దేశించి టీడీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ గన్ని వీరాంజనేయులు(Ganni veeranjaneyulu) సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడ మహానాడు సన్నాహాక సమావేశం సందర్భంగా హనుమాన్ జంక్షన్‌లో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ... ‘‘వైసీపీలో వెధవన్నర వెధవలంతా కృష్ణా జిల్లాలోనే ఉన్నారు... కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ ఈ కోవలోవారే’’ అని అన్నారు. వీరందరికి గుడివాడ మహానాడు ద్వారా బుద్ది చెప్పాలని వీరాంజనేయులు పిలుపునిచ్చారు.
చింతమనేని మాట్లాడుతూ... ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేయడం దారుణమని మండిపడ్డారు. ఎన్టీఆరే వైసీపీ పెట్టారని కూడా వారు ప్రచారం చేసుకోగలరని అన్నారు. గుడివాడ మహానాడు విజయవంతం కావడం రాష్ర్టానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి