ఏలూరు: జగన్‌వి నవరత్నాలు కావని...నవ మోసాలు అని టీడీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గన్ని వీరాంజనేయులు విమర్శించారు. ప్రజలను జగన్ రెడ్డి మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. ఫింఛన్లు పెంచుతానని చెప్పి మాట తప్పి, మడమ తిప్పలేదా అని ప్రశ్నించారు. రెండేళ్ల కాలంలో రాష్ట్రానికి చేసిన అప్పు ఎంత అని నిలదీశారు. సంపద పెంచడం చేతకాక, అప్పులు తెచ్చి ప్రజలకు పంచుతున్నారని వీరాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.