గౌరవసభలో మాట్లాడుతున్న ముప్పిడి
ద్వారకాతిరుమల, జనవరి 24: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మద్దుల గూడెంలో సోమవారం జరిగిన గౌరవ సభలో ఆయన మాట్లాడారు. ప్రజలందరినీ ఏదోవిధంగా పీడిస్తూ దుష్ట పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు లంకా సత్తిపండు, పి.గాంధి, ఏపూరి దాలయ్య, వడ్లపూడి ప్రసాద్, మద్రాసు రాము, సహృదయ్. డి చౌదరి, మాణిక్యాలరావు, బాలయ్య, కాలే అశోక్ తదితరులు పాల్గొన్నారు.