అమరావతి: సీఎం జగన్ ఈ మూడేళ్ల కాలంలో ప్రజలకు నరకాన్ని చూపించారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ ది జనరంజక పాలన కాదు జనపీడిత పాలన అని వ్యాఖ్యానించారు. ఏపీలో సంక్షేమ పాలన కాదు సంక్షోభ పాలన నడుస్తోందన్నారు. జగన్ నెలకొకసారైనా సచివాలయం ముఖం చూడరని విమర్శించారు. ప్రత్యేక హోదాతో రాయితీలు వస్తాయని చెప్పి, ప్లేటు ఫిరాయించారన్నారు. 22 మంది ఎంపీలను ఇచ్చినా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తేలేదని ఆయన మండిపడ్డారు.
టీడీపీ హయాంలో 16 వందలకు అమ్ముకున్న ధాన్యం నేడు వెయ్యికి దిగజారిందన్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టబడిందని ప్రభుత్వ గణాంకాలే తేల్చాయని తెలిపారు. 26 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ప్రభుత్వం కేవలం రూ.1402 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత యేడాది సెప్టెంబర్‌లో జరిగిన పంట నష్ట పరిహారాన్ని ఇవ్వలేదని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
ఇవి కూడా చదవండి