హైదరాబాద్: తమ కుటుంబంపై కించపరిచే విధంగా వీడియోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కూతురు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ మహిళలపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.