విజయవాడ: ప్రజలు ఎలా పోయినా.. మనం దోచుకుందామనే విధంగా వైసీపీ పాలన సాగుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ఆదాయాన్ని పతనావస్థకు చేర్చారని విమర్శించారు. డ్వాక్రా మహిళలు, విద్యార్ధులకు ఇవ్వాల్సిన సొమ్ములను కూడా వెనక్కి లాక్కున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి దిగుతారా.. ధరలు తగ్గిస్తారా అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. సంక్రాంతి పండుగ సమయంలో కనీసం పప్పులు కూడా వండలేని స్థితిలో పేదలు ఉన్నారన్నారు. చంద్రబాబు గతంలో ప్రత్యేకంగా పండుగలకు కానుకలు ఇచ్చారని దేవినేని ఉమా గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి