Abn logo
Sep 28 2021 @ 13:30PM

వెలగలేరు గ్రామంలో దేవినేని ఉమా పర్యటన

విజయవాడ: కృష్ణా జిల్లా జి. కొండూరు మండలంలోని వెలగలేరు గ్రామంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు.  జగనన్న కాలనీల పేరిట వెలగలేరు గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ళ స్థలాలు వరద నీటిలో మునిగిపోవడాన్ని తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చున్న ముఖ్యమంత్రి కళ్ళకు కనబడేలా చేయాలనే తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. జగనన్న ముంపు కాలనీగా పేరు పెట్టుకోవాలన్నారు. సెంటు పట్టాతో పాటు లబ్దిదారులకు పడవ కూడా ఇవ్వాలంటూ యెద్దేవా చేశారు. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన అధికారులు, మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసిన మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు ప్రజలకు సమాధానం చెప్పాలని దేవినేని ఉమా అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption