AP News: ఒక అసమర్ధుడి చేతిలో పోలవరం ప్రాజెక్టు పెట్టారు: దేవినేని

ABN , First Publish Date - 2022-07-20T18:17:49+05:30 IST

ఒక అసమర్ధుడి చేతిలో పోలవరం ప్రాజెక్టు పెట్టారని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.

AP News: ఒక అసమర్ధుడి చేతిలో పోలవరం ప్రాజెక్టు పెట్టారు: దేవినేని

ఏలూరు: ఒక అసమర్ధుడి చేతిలో పోలవరం ప్రాజెక్టు(Polavaram project) పెట్టారని టీడీపీ(TDP) మాజీ మంత్రి దేవినేని ఉమ(Devineni uma) విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... జూన్, జులైలో వరదలు వస్తాయని తెలియని మంత్రి అంబటి రాంబాబు(Ambati rambabu), సీఎం జగన్(Jagan) అని అన్నారు. 280 డ్రెడ్జింగ్ కాంట్రాక్టు సీఎం బంధువుకి ఇవ్వాలని సీఎంవో నుంచి అధికారులకు ఆదేశాలు వెళ్ళాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పట్ల వ్యూహాత్మక,  చారిత్రాత్మక తప్పిదం చేసారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 1, 2 అడుగులకు తగ్గించడానికి జగన్ ఒప్పుకున్నాడని తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) వాళ్ల అసెంబ్లీలో మాట్లాడారని... ఆయన మాట్లాడి 37 నెలలు అవుతున్నా జగన్ గానీ,  ఆయన మంత్రులు గానీ ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.


ఎన్నికల్లో డబ్బులు తెచ్చుకున్నారు కాబట్టే పోలవరంను, అమరావతిని పండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బతుకంతా బట్టలు విప్పతీసి కేంద్రం చూపించిందన్నారు. పార్లమెంటు సాక్షిగా వాస్తవాలు బయటపడ్డాయని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని.. జగన్ జాతీయ ద్రోహం చేసారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ డ్రామా వల్ల,  ప్రాజెక్టును కొట్టేయాలనే డ్రామా వల్ల పోలవరం ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రానికి తానే సీఎం అని జగన్ అనుకుంటే,  పోలవరం ప్రాజెక్టుపై మీడియా ముందుకు రావాలని దేవినేని ఉమా సవాల్ విసిరారు. 

Updated Date - 2022-07-20T18:17:49+05:30 IST