Abn logo
Sep 27 2021 @ 14:21PM

ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి: Devineni

అమరావతి: మార్కెట్ యార్డ్ వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు.  మార్కెట్ యార్డులు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లబోతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని హితవుపలికారు. రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని... రైతు ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడుతున్నారని, ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో పెట్టారని ఆయన అన్నారు. రైతు డబ్బు కట్టిన తరువాతే కరెంట్ ఇచ్చే పరిస్థితి చాలా జిల్లాలో కనిపిస్తుందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతోమంది పోరాటాలు చేశారని,  పొలీస్ కాల్పుల్లో 35 మంది చనిపోయారని అన్నారు. విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. ఆ ప్రైవేటీకరణకు మద్దతు తెలిపి ఇక్కడ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి పార్లమెంట్లో చాలా స్పష్టంగా వ్యవసాయ బిల్లులను సమర్థిస్తూ ఆ రోజు ఇతర పక్షాలను తిట్టడం జరిగిందని గుర్తుచేశారు. 28 మంది ఎంపీలను పెట్టుకొని ప్రభుత్వాల మీద పోరాటం చేయకుండా ఢీల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారు .. ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇవాళ స్వచ్ఛందంగా భారత బంద్‌ను విజయవంతం చేశారన్నారు. ఇవాళ తెస్తున్న ఈ చట్టాలు రైతుకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పక్షాన ఉండాలని దేవినేని ఉమా స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption