అమరావతి: సీపీఎస్ రద్దుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళం పాడటంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘నాడు వారంలో సీపీఎస్ రద్దు అని అధికారంలోకి రాగానే ఉద్యోగులను మోసంచేశారు. మూడేళ్ల అసమర్థపాలనతో ఉద్యోగుల హామీలను గాలికొదిలేసి ఒకపోస్టు భర్తీచేయలేదు. జీతాలు, పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వలేని స్థితికి తెచ్చారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి నేడు మాటతప్పి మడమ తిప్పడం నిజం కాదా?.. వైఎస్ జగన్’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి