విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ కృష్ణానది ఒడ్డున మాజీ మంత్రి దేవినేని ఉమా నిరసనకు దిగారు. కృష్ణానదిలో వెంటనే చేప పిల్లలను వదలాలంటూ గ్రామస్తులు, మత్స్యకారులతో కలిసి నినాదాలు చేశారు. జీవో నెంబర్ 217 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు, మత్స్యకారులు, గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి