Abn logo
Jun 23 2021 @ 13:16PM

పోస్టులపై శ్వేతపత్రం విడుదల చెయ్యగలరా?: దేవినేని

అమరావతి: ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘నిరుద్యోగ భృతి రద్దు చేసారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగుల గొంతుకోసారు. పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వేల ఖాళీలుంటే పదుల్లో పోస్టులు సేవ అని చెప్పి వాలంటీర్ లెక్కలు కలిపేశారు. 6500 పోలీస్ ఉద్యోగాల హామీ గాల్లో వదిలేసారు. పోస్టులపై శ్వేతపత్రం విడుదల చెయ్యగలరా ? వైయస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.