చంద్రబాబు మాటలకు సమాధానం చెప్పండి: దేవినేని

ABN , First Publish Date - 2020-09-17T16:47:29+05:30 IST

వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు మాటలకు సమాధానం చెప్పండి: దేవినేని

అమరావతి: వైసీపీ ప్రభుత్వం తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘రాష్ట్రంలో ఎప్పుడూ లేని వింతపోకడలు, భక్తులు జైల్లో ఉంటే అరాచకశక్తులు రోడ్లపైనా? చవితి వేడుకలకు ఆంక్షలు విధించిన ప్రభుత్వం, పుట్టినరోజు వేడుకలకు మాత్రం ప్రోత్సాహకాలతో జీవోలతో హడావుడా? ఆలయ ఘటనలను ముఖ్యమంత్రి ఎందుకు ఖండించడంలేదని అడుగుతున్న చంద్రబాబు మాటలకు సమాధానం చెప్పండి సీఎం జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-09-17T16:47:29+05:30 IST