Abn logo
May 15 2021 @ 12:05PM

రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అక్రమం: దేవినేని

అమరావతి: ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్‌ను టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఖండించారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘హార్ట్ సర్జరీ జరిగిన ఎంపీ రఘురామ కృష్ణంరాజును 35 మందితో అక్రమంగా అరెస్ట్ చేయించారు. అక్రమ కేసులు బనాయించి బలవంతంగా కారులో తీసుకెళ్లారు. వ్యాక్సిన్లు తెప్పించలేరు.అంబులెన్సులను బోర్డర్ దాటించలేరు. ప్రజల ప్రాణాలు కాపాడలేరు. తప్పుడు కేసులతో ప్రభుత్వానికి లేని ప్రతిష్ట ఎలా వస్తుంది ? వైయస్ జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.


Advertisement
Advertisement
Advertisement