అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు ప్రోగ్రామ్ సీఎం జగన్ ఊహించిన దానికంటే సక్సెస్ అయ్యిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. అధికారం కోల్పోతామనే భయంతో జగన్‌కు నిద్ర పట్టడం లేదన్నారు. మంత్రులను, ఎమ్మెల్యేలను గడప గడపకు పంపిస్తున్నారు..కానీ తమ గడపకు వద్దని ప్రజలు చీదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ అవినీతి పాలన పట్ల ప్రజలు విసిగిపోయి.. వైసీపీ నాయకుల మొహం మీదే ఉమ్మేస్తున్నారని తెలిపారు. గుంటూరులో బీటెక్ అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగినా.. తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారము చేసినా ప్రభుత్వం ఏమాత్రం చలించకుండా ఉందని మండిపడ్డారు. అమ్మాయిల జీవితాల కంటే జగన్‌కు తన అధికారమే ముఖ్యమని దేవతోటి నాగరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి