అంబేద్కర్ పేరు పెట్టలేకపోవడం దళిత వ్యతిరేకతకు నిదర్శనం: Devathoti

ABN , First Publish Date - 2022-04-04T18:04:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలో ఏ ఒక్క జిల్లాకు కూడా అంబేద్కర్ పేరు పెట్టలేకపోవడం దళిత వ్యతిరేకతకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు.

అంబేద్కర్ పేరు పెట్టలేకపోవడం దళిత వ్యతిరేకతకు నిదర్శనం: Devathoti

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాలో ఏ ఒక్క జిల్లాకు కూడా అంబేద్కర్ పేరు పెట్టలేకపోవడం దళిత వ్యతిరేకతకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... నిండు అసెంబ్లీలో దళితులకు దగా జరుగుతున్న దళిత నాయకులు మాట్లాడకపోవడం జగన్ రెడ్డి నియంతృత్వ పోకడకు పరాకాష్ట అని మండిపడ్డారు. 29 సంక్షేమ పథకాలను రద్దు చేసినా దళితుల హక్కులు దహించుకుపోతున్నా వైసీపీ దళిత నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు చట్టసభల్లో కూడా ప్రశ్నించలేని నాయకుడు జీవంలేని బండరాయితో సమానమని దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-04-04T18:04:00+05:30 IST