కడప: జిల్లాలోని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో పున: ప్రారంభోత్సవాలను సుధీర్ రెడ్డి మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఎవరికీ విలువ ఇవ్వకపోయినా కనీసం మీ ముఖ్యమంత్రి జగన్‌కైనా విలువ ఇవ్వవా అని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన పెద్దముడియం పోలీస్‌స్టేషన్‌ను నువ్వు మళ్ళీ ప్రాంభించావని ఆయన ఎద్దేవా చేశారు. దేవగుడిలో పశు వైద్య శాల భవనాన్ని మళ్లీ ప్రారంభించావన్నారు. పున: ప్రారంభాలతో నీ విలువ తీసుకుని, నవ్వులపాలు కాకు అని ఎమ్మెల్యేకు ఆయన హితవు పలికారు. విమర్శలు మానుకొని ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. పెన్నా బ్రిడ్జి పాత రోడ్డుకు తొలి జెండా ఊపిన ఘనత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిదేనని ఆయన ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి