Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

నా జీవితంలో ఇలాంటి ఉత్సాహం చూడలేదు: Chandrababu

twitter-iconwatsapp-iconfb-icon

అనంతపురం: ‘‘నా జీవితంలో ఇలాంటి ఉత్సాహం చూడలేదు ఎక్కడ చూసినా కార్యకర్తలే... కార్యకర్తలే సంపద’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) అన్నారు. శుక్రవారం విస్తృత స్థాయి సమావేశంలో టీడీపీ అధినేత మాట్లాడుతూ... కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన నియోజకవర్గంలోనే బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ఎన్టీ రామారావుకు అనంతపురం మీద ఎనలేని ప్రేమ ఉండేదని.. సొంత నియోజకవర్గం గుడివాడను వదిలిపెట్టి హిందూపురం ఎంచుకున్నారని తెలిపారు. బాదుడే బాదుడు భయంకరంగా ఉందా లేదా చెప్పండి తమ్ముళ్ళు అంటూ బాబు ప్రశ్నించారు. కరువు జిల్లా అనంతపురంలో సస్యశ్యామలం చేసేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు.  13 వేల కోట్లతో పరిశ్రమను ఏర్పాటు చేసి 30 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. మూడు సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. రౌడీయిజానికి జాకీ పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిందని చంద్రబాబు అన్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.