గుంటూరు: నరసరావుపేటలో టీడీపీ నేత చదలవాడ అరవింద్బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓ ఫ్లెక్సీ తొలగించారంటూ టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.వైసీపీ ఫ్లెక్సీ తొలగింపులో అరవింద్బాబుతో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం టీడీపీ ఇన్చార్జ్ అరవింద్బాబును పోలీసులు బెయిల్పై విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి