108 ప్రారంభోత్సవం...సాయిరెడ్డి జన్మదినం ఒకేరోజు యాదృచ్చికమా?: వెంకన్న

ABN , First Publish Date - 2020-07-01T13:44:38+05:30 IST

108 ప్రారంభోత్సవం...సాయిరెడ్డి జన్మదినం ఒకేరోజు యాదృచ్చికమా?: వెంకన్న

108 ప్రారంభోత్సవం...సాయిరెడ్డి జన్మదినం ఒకేరోజు యాదృచ్చికమా?: వెంకన్న

అమరావతి: 108 వాహనాల్లో అవకతవకలకు సంబంధించి వైసీపీ ఎంపీ సాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘రూ.300 కోట్లు కొట్టేసిన 108 ప్రారంభోత్సవం, మీ జన్మదినం ఒకే రోజు రావడం యాదృచ్చికమా? లేక మీరు వేసిన రివర్స్ టెండర్‌కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా? ఇప్పటికైనా ఆలస్యం కాదు. మారు మనస్సు పొంది దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని కోరుకుంటూ ఎంపీ విజయసాయిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ బుద్దా వెంకన్న ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-07-01T13:44:38+05:30 IST