Bonda uma: ఏపీ ప్రజలు త్వరలోనే దుష్టపాలనకు చరమగీతం పాడతారు

ABN , First Publish Date - 2022-08-29T19:30:29+05:30 IST

ఏపీ ప్రజలు త్వరలోనే దుష్టపాలనకు చరమగీతం పాడతారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

Bonda uma: ఏపీ ప్రజలు త్వరలోనే దుష్టపాలనకు చరమగీతం పాడతారు

అమరావతి:  ఏపీ ప్రజలు త్వరలోనే దుష్టపాలనకు చరమగీతం పాడతారని టీడీపీ (TDP) పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు (Bonda umamaheshwar rao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో వైసీపీ (YCP) అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని... దీనికి రాష్ట్రంలో కాలం చెల్లిందని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి (Jagan mohan reddy)ని, వైసీపీ ని ఛీత్కరించుకుంటున్నారని తెలిపారు. ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని జగన్ (Jagan mohan reddy) దోచుకుతింటున్నారని ఆరోపించారు. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను జగన్ రెడ్డి (AP CM) ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఐప్యాక్ సర్వేలో వైసీపీ ఘోరంగా ఓడిపోతుందని రిపోర్టులు వచ్చాయన్నారు. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికే ప్రతిపక్ష నేతపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కుప్పం వేదికగా ప్రజాస్వామ్యాన్ని జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy ramachandra reddy) ఖూనీ చేశారన్నారు. రూ.10వేల కోట్ల విలువ గల లేపాక్షి భూములను జగన్ కుటుంబం దోచుకుందని ఆయన ఆరోపించారు.


ఢిల్లీ మద్యం కుంభకోణంలోనూ జగన్ (YS Jagan), భారతి (Bharathi), విజయసాయిరెడ్డి (Vijayasaireddy), కుటుంబసభ్యులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల (YCP Leaders) అరాచకాలు, వేధింపులతో ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. వీటన్నింటి నుండి తప్పించుకోవడానికే కుప్పంలో జగన్ రెడ్డి (Andhrapradesh chief minister) అల్లర్లు సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ భరత్ (MLC Bharath) కనుసన్నల్లో చంద్రబాబు (Chandrababu)పై దాడికి యత్నించారన్నారు. చంద్రబాబు (TDP Chief) పర్యటనలో ఏపీ పోలీసులు (AP Police) ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. టీడీపీ నాయకులు (TDP Leaders), కార్యకర్తల తలలు పగులకొట్టినా వైసీపీ కార్యకర్తలపై పోలీసు చర్యలు శూన్యమన్నారు. ప్రతిపక్ష నేతలను బెదిరించడానికే కుప్పంలో 60మందిపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని అన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తున్న కొంతమంది పోలీసు అధికారులు రానున్న కాలంలో మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఏపీ(Andhrapradesh)లో ఇటువంటి అరాచకపాలన ఎన్నడూ చూడలేదన్నారు. జగన్, పెద్దిరెడ్డి ఉడత ఊపులకు టీడీపీ భయపడే ప్రసక్తే లేదని... ఎన్ని కేసులు, నిర్బంధాలు, అరెస్టులకైనా తాము సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు త్వరలోనే దుష్టపాలనకు చరమగీతం పాడతారని బోండా ఉమా అన్నారు.

Updated Date - 2022-08-29T19:30:29+05:30 IST