Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారో సమాధానం చెప్పాలి: Bonda uma

అమరావతి: వైసీపీ ప్రభుత్వం అవినీతి వల్లే కరెంటు ఛార్జీలు పెరిగాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిస్కింలు భ్రష్టుపట్టాయని మండిపడ్డారు. ట్రూఆప్ పేరుతో ఇప్పటికే రూ.3670 కోట్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారం మోపారన్నారు. ఇప్పుడు మళ్లీ రూ.2500 కోట్లు కరెంటు చార్జీలు పెంచటానికి ప్రతిపాదనలు పంపారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా  మన రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్లో సోలార్ విద్యుత్ యూనిట్ రూ.2కే దొరుకుతుందన్నారు. కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచారో వైసీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కరెంటు ఛార్జీలు పైసా కూడా పెంచలేదని బోండా ఉమా అన్నారు. 

Advertisement
Advertisement