Abn logo
Oct 19 2021 @ 09:37AM

గంజాయిపై వాస్తవాలు చెబితే నోటీసులు ఇస్తారా?: Bonda uma

అమరావతి: ఏపీని మాదకద్రవ్యాలకి అడ్డాగా వైసీపీ మార్చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా విమర్శలు గుప్పించారు. గంజాయిపై వాస్తవాలను ప్రజలకు తెలియచేస్తే ఆనందబాబుకి నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. వైజాగ్‌లోనే కాదు ఏపీ అంతటా వైసీపీ నాయకులు గంజాయి వ్యాపారం హోల్‌సేల్‌గా చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు గంజాయి వ్యాపారం చేసే వైసీపీ నాయకులను వదిలేసి టీడీపీ నాయకలును వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు నిందితులకు రక్షణ కల్పిస్తున్నారని... కంప్లైంట్స్‌కి వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఏపీలో 9 వేల ఎకరాలు గంజాయి సాగు జరుగుతుంది అని కేంద్ర నిఘా వర్గాలు అంటున్నాయని తెలిపారు. దేశంలో పక్క రాష్ట్రాలలో ఎక్కడ గంజాయి దొరికినా ఏపీలోనే దాని మూలాలు ఉంటున్నాయన్నారు. తెలంగాణా పోలీసులు విశాఖ ఏజెన్సీలోకి వచ్చి గిరిజనుడిపై కాల్పులు జరిపారని అన్నారు. తెలంగాణ పోలీసులు విశాఖకు వచ్చింది గంజాయి స్మగ్లర్ల కోసం కాదా? విశాఖ పోలీసులు చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption