Abn logo
Sep 25 2021 @ 10:07AM

ఏపీలో విద్యా వ్యవస్థ నాశనమువుతోంది: Bonda uma

అమరావతి: వైసీపీ ప్రభుత్వం అవగాహన లేక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా విమర్శించారు. 50 సంత్సరాలుగా పేదలకు నాణ్యమైన విద్యను అందించే మాంటిశోరి లాంటి విద్యా సంస్థలు మూతపడుతున్నాయన్నారు. దేశ వ్యాప్తంగా చరిత్ర ఉన్న లయోలా విద్యా సంస్థలు కూడా జగన్ దెబ్బకు మూసివేసే పరిస్తితి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాక ఇప్పటికే చాలా మంది పేద విద్యార్థులు చదువు మానేశారని చెప్పారు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలను వైసీపీ కొట్టేయలని చూస్తోందని.. అందుకే అవి మూతపడే విధంగా జీవోలు ఇస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు టీడీపీ అండగా ఉండి పోరాడుతుందని బోండా ఉమా స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption