Andhra news: వైసీపీ ప్రభుత్వం పార్లమెంటులో ఏపీ పరువు తీసింది: బోండా ఉమా

ABN , First Publish Date - 2022-07-20T20:06:15+05:30 IST

వైసీపీ(YCP) ప్రభుత్వం పార్లమెంటు(Parliament)లో ఏపీ(AP) పరువు తీసిందని టీడీపీ(TDP) నేత బోండా ఉమా(Bonda uma) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Andhra news: వైసీపీ ప్రభుత్వం పార్లమెంటులో ఏపీ పరువు తీసింది: బోండా ఉమా

అమరావతి:  వైసీపీ(YCP) ప్రభుత్వం పార్లమెంటు(Parliament)లో ఏపీ(AP) పరువు తీసిందని టీడీపీ(TDP) నేత బోండా ఉమా(Bonda uma) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ పాలనలో పోలవరం నిర్మాణం అగమ్యగోచరమైందన్నారు. పోలవరం పూర్తి కాకపోవడంపై ఎంపీ కనకమేడల(Kanakamedal) ప్రశ్నకు కేంద్ర జలశక్తి సమాధానం ఏపీ పరువు తీసేలా ఉందని తెలిపారు. జగన్ నిర్లక్ష్యంతోనే పోలవరం ఆగిందంటున్న వారికి ఏం చెబుతారని ప్రశ్నించారు. పోలవరం పునరావాసులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 70 శాతం పూర్తి చేశామని అన్నారు. పోలవరానికి రూ.11 వేల కోట్లు ఖర్చుతో 70 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. మూడేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందని నిలదీశారు. వైసీపీ హయాంలో పోలవరం పనులు ఎంతశాతం పూర్తయ్యాయన్నారు. పోలవరం నిర్వాసితులకు ఎంత పరిహారం ఇచ్చింది, పోలవరం పనులపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా అంటూ బోండా ఉమా ప్రశ్నల వర్షం కురిపించారు. 

Updated Date - 2022-07-20T20:06:15+05:30 IST