మంత్రి పెద్దిరెడ్డిపై బోండా ఉమా విమర్శలు

ABN , First Publish Date - 2022-04-09T19:07:18+05:30 IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మంత్రి పెద్దిరెడ్డిపై బోండా ఉమా విమర్శలు

అమరావతి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డి పెద్దారెడ్డిగా మారి.. అరాచకాలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. జే గ్యాంగులో పెద్దిరెడ్డి ప్రధాన భాగస్వామి అని అన్నారు. జగన్ లావాదేవీలను దగ్గరుండి చూసే కీలక వ్యక్తి పెద్దిరెడ్డి అని వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి అక్రమార్జన అక్షరాలా రూ.6,889 కోట్లు అని... శివశక్తి డెయిరీ ద్వారా పాడి రైతుల పొట్టకొట్టి పెద్దిరెడ్డి రూ.700 కోట్లు దోచారని ఆరోపించారు. పల్ప్ కంపెనీ ద్వారా మామిడి రైతుల నుంచి రూ.190 కోట్లు దోపిడీ చేశారన్నారు. మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాగా ఏర్పడి పెద్దిరెడ్డి భారీ దోపిడీకి తెర తీశారని అన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ భూకబ్జాకు కేంద్రం పెద్దిరెడ్డే అని మండిపడ్డారు. వేల ఎకరాలను మాఫియా ద్వారా చేజిక్కించుకుని రూ.2 వేల కోట్లకు పైగా అక్రమార్జన చేసిన ఘనత పెద్దిరెడ్డిదే అని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా రూ.1,800 కోట్లు సంపాదించారని బోండా ఉమా విమర్శలు గుప్పించారు. 


Updated Date - 2022-04-09T19:07:18+05:30 IST