Ayyannapatrudu: సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేకు రుణమాఫీ అయ్యింది.. మర్చిపోతే ఎలా?

ABN , First Publish Date - 2022-10-02T14:30:23+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు.

Ayyannapatrudu: సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యేకు రుణమాఫీ అయ్యింది.. మర్చిపోతే ఎలా?

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasaireddy)కి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu) ట్విట్టర్ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. వైఎస్‌ మదన్‌మోహన్‌రెడ్డి (YS Madanmohan reddy)కి, జగన్ (YS Jaganmohanreddy) వదిన వైఎస్ మాధవీలత (YS Madhavilatha)కు టీడీపీ (TDP) హయాంలో రైతు రుణమాఫీ అయ్యిందని గుర్తుచేశారు. వైఎస్‌ మధు అకౌంట్ నెంబర్ 045213100036589లో రెండు విడతలుగా రూ.63 వేలు, 3వ కంతుగా రూ.36 వేలు జమ అయ్యాయని, అలాగే వైఎస్ మాధవిలత అకౌంట్ నెంబర్ 045213100036613లో రెండు కంతులుగా రూ.59643, 3వ కంతుగా రూ.34081 వైసీపీ ఎమ్మెల్యేకు కూడా రుణమాఫీ అయ్యింది.. మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. ‘‘మా హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని మ్యాచ్ చేయడం మీతరం కాదు వీసారెడ్డి’’ అంటూ అయ్యన్న (TDP Leader) ట్వీట్ చేశారు. 


Updated Date - 2022-10-02T14:30:23+05:30 IST