మంత్రి బొత్సకు అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్
ABN , First Publish Date - 2022-04-29T15:55:31+05:30 IST
మంత్రి బొత్స సత్యనారాయణకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘’వైఎస్ మృతి వెనుక జగన్ హస్తముంది. వైఎస్ విజయలక్ష్మి జగన్ తీరు దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్టు ఉందంటూ నీ అంత డిగ్నిఫైడ్‌గా మాట్లాడటం మా లోకేష్‌కు రాదు బొత్స సత్తిబాబు. సొమ్ములు పోనాయ్ ఏటి సేత్తాం అని చిల్లరగా మాట్లాడి మంత్రిగా ఫెయిల్ అయిన నీ లాంటి వాళ్ళపై దాడులు జరిగితే కడుపుమంట అనుకోవడంలో తప్పులేదు. మహిళలకు అండగా నిలుస్తున్న లోకేష్‌ను చూసి అక్కసుతో గ్యాస్ ఎక్కువై జగన్ రెడ్డి పంపిన రౌడీలు రాళ్ళు విసిరితే కడుపుమండి ఎవరో చేసారని కవరింగ్ ఎందుకు బొత్సా?’’ అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.