Advertisement
Advertisement
Abn logo
Advertisement

రెండున్నరేళ్లలో ఏపీ పరువు దెబ్బతింది: Achennaidu

విశాఖపట్నం:  రెండున్నరేళ్లలో ఏపీ పరువు దెబ్బతిందరి.. ఏపీ అంటే అసహ్యించుకునే దుస్ధితి ఏర్పడిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. గంజాయ్, హెరాయిన్ ఎక్కడ పట్టుబడినా... మూలాలు ఏపీ నుంచే అనే వస్తోందన్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారని..ఆర్ధిక మూలలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ఎవ్వరూ ఇష్టపడటంలేదని తెలిపారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన  రోజున వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ఇస్తున్నారన్నారు. వైఎస్ఆర్ చేసిందేంటి అని నిలదీశారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈరోజున అవార్డులు ఇవ్వడం ఆయన త్యాగాన్ని  పక్క తోవపట్టించడమే అని అచ్చెన్నాయుడు అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement