Advertisement
Advertisement
Abn logo
Advertisement

వారిపై సుమోటోగా కేసు నమోదు చేసే ధైర్యం డీజీపీకి ఉందా?: అచ్చెన్న

విజయవాడ: టీడీపీ నేతలపై అక్రమ కేసులను ఖండిస్తున్నానని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ నిరసన తెలిపితే కొవిడ్ నిబంధనల ఉల్లంఘన పేరుతో అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. మహామేత వర్థంతి సభలకు, వైసీపీ నేతల పాదయాత్రలకు, రికార్డింగ్ డ్యాన్సులకు కొవిడ్ నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను జగన్‌రెడ్డి భయపెడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతల చిట్టా తమ దగ్గర ఉందని.. వారిపై సుమోటోగా కేసు నమోదు చేసే ధైర్యం డీజీపీకి ఉందా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. 

Advertisement
Advertisement