Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేను అధికారంలోకి వస్తే....: Achennaidu

శ్రీకాకుళం: ‘‘155 స్థానాలలో చంద్రబాబు అధికారంలోకి రానున్నారు.. నేను అధికారంలోకి వస్తే కొంత మంది పెద్దలను పలకరించే వారు ఉండరు’’ అంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గం కొత్త పేట నుండి కోటబొమ్మాళి రైతు బజార్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహారిస్తూ కార్యకర్తలను బెదిరించారని అన్నారు. టెక్కలిలో పోలీస్ అధికారి వైసీపీకి , జగన్‌ను ఒకమాట అంటే చాలా బాధడిపొతున్నాడని తెలిపారు. ర్యాలీలకు, కార్యక్రమాలకు అడ్డుపడటం తమ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. జగన్ సామ, దాన , దండోపాయాలు ఉపయోగించి టీడీపీని నాశనం చేయాలని సూచించారని.... బిల్లులు ఆపేస్తే టీడీపీని వీడిపోతారని జగన్ భావించారని తెలిపారు. వ్యాపారాలు నాశనం చేశారని, భూములు స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. తన మీద కేసులు పెట్టినా భయపడలేదని చెప్పారు. అచ్చెన్నను అరెస్ట్ చేస్తే పంచాయితీలు గెలవాలనుకున్నారని...అయితే సర్పెంచ్‌లు గెలిచినా ఏం ప్రయోజనం, నాలుక గీసుకోడానికి పనికిరావని వ్యాఖ్యానించారు. వైసీపీ సర్పంచ్‌లే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. 

Advertisement
Advertisement