Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: అచ్చెన్నాయుడు

అమరావతి: వైసీపీ పాలనలో రాష్ట్రం అబద్దాలకు, అరాచకానికి, వంచనకు చిరునామా జగన్ జమానాగా మారిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఘోరాతి ఘోరాలు జరుగుతున్నా పోలీసు వ్యవస్థది ప్రేక్షక పాత్ర వహించటం బాధాకరమన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై  దాడులు చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తల్ని  అందుకు సహకరించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే ఇప్పుడు తప్పు చేసిన వారు రేపు చంద్రమండలంలో దాక్కున్నా సరే వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అకారణంగా అధికారమదంతో తమరు చేస్తున్న దుశ్చర్యలకు ప్రతిఫలం అనుభవించక తప్పదని తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ‎మాజీ జడ్పీటీసీ బత్తిన శారద ఇంటిపై దాడి చేసి ఇల్లు, బైక్లు దగ్ధం చేయడాన్న తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


వినాయక ఊరేగింపులో ఇలాంటి అరాచకం ఏంటని ఆయన ప్రశ్నించారు.  ఘటనా స్ధలంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించటం పోలీసు వ్యవస్ధ పనితీరుకు అద్దం పడుతోందని విమర్శించారు.  టీడీపీ కార్యకర్తల ఇల్ల మీదకు వచ్చి వైసీపీ రౌడీ మూకలు దాడులు చేస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీశారు. పోలీసుల సమక్షంలో దాడులు జరుగుతున్నందుకేనా రాష్ట్ర పోలీసులకు అవార్డులు వచ్చిందని దుయ్యబట్టారు. హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయింటే రాష్ట్రంలో పరిస్థితి ఏవిధంగా ఉందో తేటతెల్లమవుతోందన్నారు. బత్తిన శారద ఇంటిపై దాడికి పాల్పడిన వారిపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.  ‘‘అసలు ఏంటి ఈ అరాచకం తాలిబన్ల రాజ్యం స్ధాపిద్దామనుకుంటున్నారా?  ఆంధ్రప్రదేశ్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి తేడా ఏంటి?’’ అంటూ అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement