అమరావతి: రాష్ట్రంలో పాలకులే భక్షకులుగా మారారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క నేరస్థుడికీ శిక్షపడలేదన్నారు. ప్రభుత్వ ఉదాసీనత మృగాళ్లకు అస్త్రంగా మారిందన్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కన్నా భూశంకర్రావును దిశా చట్టం కింద ఉరి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకూ టీడీపీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి