Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రం ఒక ఆర్ధిక నిపుణుడిని కోల్పోయింది...రోశయ్య మృతిపై Achenna

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య మృతితో రాష్ట్రం ఒక ఆర్ధిక నిపుణుడిని కోల్పోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రోశయ్య మృతి బాధాకరమన్నారు. రోశయ్య  ఏ పదవి చేపట్టినా ప్రజాసేవే పరమావధిగా పనిచేశారని చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆర్ధిక మంత్రిగా, ‎ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందించారన్నారు. రోశయ్య అన్ని పార్టీల నాయకులతోనూ ఎలాంటి విభేదాలకు తావు లేకుండా  స్నేహపూర్వకంగా మెలిగేవారని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు అచ్చెన్నాయుడు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 


Advertisement
Advertisement