భీమవరం: అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Achennaidu) కోరారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.... అల్లూరి సీతారామరాజు (Alluri sitaramaraju) కాంస్య విగ్రహాన్ని అందరికన్నా ముందుగా దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కేంద్ర ప్రొటోకాల్‌లో ఉన్న పేరును రాష్ట్ర అధికారులు తొలగించారని, మోదీ సభకు వెళ్లకుండా తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. వైసీపీ (YCP) పాలనలో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయన్నారు. మోదీ సభలో అధ్యక్షత వహించాల్సిన స్థానిక ఎంపీ రఘురామరాజు (Raghuramaraju) రాకుండా అడ్డుకోవడం దుర్మార్గమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి