పార్టీ మారినవారిపై అక్రమ కేసులు దుర్మార్గం: Achennaidu

ABN , First Publish Date - 2022-07-01T16:07:09+05:30 IST

పార్టీ మారిన నేతలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

పార్టీ మారినవారిపై అక్రమ కేసులు దుర్మార్గం: Achennaidu

అమరావతి: పార్టీ మారిన నేతలపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Achennaidu) అన్నారు. జగన్ రెడ్డి పాలన సొంత పార్టీ నేతలకే నచ్చట్లేదని అందుకే టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారిపై జగన్ రెడ్డి, వైసీపీ నేతలు కక్ష్యసాధింపులకు పాల్పడటం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. రాజంపేట పార్లమెంట్ వైసీపీ రైతు అధ్యక్షులు మద్దిరెడ్డి కొండ్రెడ్డి    తెలుగుదేశం పార్టీలో చేరారని.. అప్పటి నుంచి వైసీపీ నేతలు కొండ్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. చంద్రగిరి, మదన పల్లె, వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లలో అక్రమ కేసులు బనాయించటమే కాక వైసీపీ గూండాలు అతని ఇంటిపై దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచక విధానాల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీ మారితే కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడతారా అని ఆయన ప్రశ్నించారు.


ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన రాజకీయపార్టీలో చేరే హక్కుందన్నారు. కానీ జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రజల హక్కుల్ని కాలరాస్తూ రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పునర్ నిర్మాణం చంద్రబాబు నాయుతోనే సాధ్యమని వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు చాలామంది నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు అచ్చెన్నాయుడు అన్నారు. 

Updated Date - 2022-07-01T16:07:09+05:30 IST