అమరావతి: అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్ విధ్వంసమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Achennaidu) వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... సెక్షన్ 144 అమలులో ఉంటే అంత మంది ఎలా వచ్చారని ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటి మీది దాడి జరిగిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఎందుకు భద్రత కల్పించలేకపోయారని అడిగారు. అమలాపురం ఘటన వెనుక ప్రభుత్వమే ఉందని టీడీపీ నేత ఆరోపించారు. హత్య ఘటన నుంచి దృష్టి మళ్లించేందుకే విధ్వంసమని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించడం డైవర్షన్ సీఎంకు బాగా అలవాటని యెద్దేవా చేశారు. కోనసీమను విధ్వంసం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి