జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేయాలి: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-05-11T12:18:14+05:30 IST

తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 10 మందిపైగా మృతి చెందడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

జగన్‌పై  పోలీసులు కేసు నమోదు చేయాలి: అచ్చెన్న

అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 10 మందిపైగా మృతి చెందడం బాధాకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్ అందక చనిపోయిన వారివన్నీ  ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. తన చేతకాని పాలనతో ప్రజల ప్రాణాలు తీస్తున్న ముఖ్యమంత్రి జగన్‌పై  పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టి  నోటీసులు ఇస్తున్నారు తప్ప,  ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఆక్సీజన్ ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.  హాస్పిటల్లలో రోగులకు సరిపడా మందులు లేవని, ఆక్సిజన్ లేదని, బెడ్లు లేవని, ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలు చనిపోతున్నా జగన్ రెడ్డికి మాత్రం కనీస మానవత్వం లేదని మండిపడ్డారు. పాలన చేతకాకపోతే జగన్ రెడ్డి రాజీనామా చేయాలి తప్ప ప్రజల ప్రాణాలు తీయడం  ఎంత వరకు సమంజసమని అచ్చెన్న ప్రశ్నించారు.

Updated Date - 2021-05-11T12:18:14+05:30 IST